: ఇమ్రాన్ ఖాన్ కు మియాందాద్ బాసట


పాకిస్థాన్ లో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభంలో తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ కు మద్దతు అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా, మాజీ క్రికెటర్ జావెద్ మియాందాద్ కూడా ఇమ్రాన్ కు సంఘీభావం ప్రకటించారు. పాకిస్థాన్ క్రికెట్ జట్టు అంతర్జాతీయంగా ఎదగడంలో ఇమ్రాన్, జావెద్ ల పాత్ర ఎంతో ఉంది. వీరిద్దరి మధ్య అప్పట్లో విభేదాలున్నప్పటికీ, జట్టు ప్రయోజనాల విషయానికొచ్చేసరికి అవన్నీ పక్కనబెట్టి విజయం కోసం పోరాడేవారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో జావెద్ మాట్లాడుతూ, ఒకప్పటి తన సహచరుడిపై ప్రశంసల జల్లు కురిపించారు. ఇమ్రాన్ జాతీయ సమైక్యత కోసం పాటుపడే వ్యక్తని, జాతి భవిష్యత్ కోసం ఆయన తపన, నిజాయతీని ఎవరూ తప్పుబట్టలేరని అన్నారు. పాకిస్థాన్ లో సామాజిక, రాజకీయ మార్పు ఇమ్రాన్ తోనే సాధ్యమని ఈ మాజీ సారథి నొక్కి చెప్పారు. కాగా, ఇమ్రాన్ కు మియాందాద్ బాసటగా నిలవడం పాక్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

  • Loading...

More Telugu News