: భారత్, జపాన్ ల బంధం ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ముందడుగు: మోడీ


జపాన్ లో మూడవరోజు పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇరు దేశాల బంధంపై సుదీర్ఘంగా ప్రసంగించారు. భారత్-జపాన్ దేశాల మధ్య బంధం ఎంతో పురాతనమైందని ప్రధాని పేర్కొన్నారు. ఎప్పటినుంచో ఉన్న ఈ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆయన ఆకాంక్షించారు. భవిష్యత్తులో విశ్వవేదికపై ఇరుదేేశాలు శక్తిమంతమైన పాత్ర పోషించే అవకాశం ఉందని, ఈ బంధానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని చెప్పారు. అనేక సందర్భాలలో భారత్ కు జపాన్ చేసిన సహాయం మరువలేనిదని మోడీ తెలిపారు. కాల పరీక్షను తట్టుకుని నిలబడిన స్నేహం ఇరు దేశాలదని, భారత్ లో ఉన్న అతిపెద్ద వ్యాపార వ్యవస్థ జపాన్ వ్యాపారంలో కీలకమని వివరించారు. ఇరు దేశాల వ్యాపార సంబంధాలు ప్రపంచానికి మార్గదర్శకం కావాలని ప్రధాని కోరారు. రెండు దేశాల మధ్య కేవలం ఆర్థిక బంధాలే కాదని, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి మరో ముందడుగని ఆయన చెప్పారు. 21వ శతాబ్దం ఆసియా దేశాలదన్న మోడీ, దానిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాబోయే కాలంలో అన్ని రంగాల అభివృద్ధిలో రెండు దేశాలు ముందుంటాయన్నారు. ప్రస్తుతం ఐదు ఒప్పందాలపై సంతకాలు చేసుకున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News