: పవన్ కల్యాణ్ కంటే మంచి టీచర్ మరెవరూ లేరు: రేణూ దేశాయ్
నటుడు పవన్ కల్యాణ్ పై రేణూ దేశాయ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫిలిం మేకింగ్ కు సంబంధించి పవన్ కల్యాణ్ తనకు గురువు అని పేర్కొన్నారు. తన జీవితంలో పవన్ కంటే మంచి టీచర్ మరెవరూ లేరని తెలిపారు. ఫేస్ బుక్ లో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. సినిమా నిర్మాణంలో పరిపూర్ణత సాధించడానికి తోడ్పడిన పవన్ కు రుణపడి ఉంటానన్నారు. తన నూతన సినిమా ట్రైలర్ ను ఆగస్టు 26న విడుదల చేయాల్సి ఉందని, అయితే, అది సెప్టెంబర్ 2కి వాయిదా పడిందన్నారు. ఆరోజు (సెప్టెంబర్ 2) పవన్ కల్యాణ్ పుట్టిన రోజు కావడం కాకతాళీయమేనని రేణూ తెలిపారు. తన జీవితంలో గొప్ప వ్యక్తి పవన్ అనీ, ఆయన జన్మదినం రోజున ట్రైలర్ విడుదల చేయడాన్ని దేవుడిచ్చిన వరం అనుకుంటానని అన్నారు. మన ఆలోచనలకు భగవంతుడు ఇలాంటి యాదృచ్ఛిక ఘటనల రూపంలో సమాధానాలు చెబుతాడని ఎక్కడో చదివానని ఆమె గుర్తు చేసుకున్నారు. ఇదే విషయాన్ని పవన్ కు చెబితే నవ్వి ఊరుకున్నాడని వెల్లడించారు.