: బొగ్గు కుంభకోణంలో సుప్రీం విచారణ ఈ నెల 9కి వాయిదా
బొగ్గు క్షేత్రాల కేటాయింపుల కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కేసు తదుపరి విచారణను కోర్టు ఈ నెల 9వ తేదీకి వాయిదా వేసింది. ఈ లోగా కేంద్రప్రభుత్వం, పిటిషనర్లు లిఖితపూర్వకంగా తమ వాదనలను కోర్టును సమర్పించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.