: పాక్ లో తగ్గని ఆందోళనలు... సచివాలయం గేట్ ధ్వంసం


పాకిస్థాన్ లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. పాక్ మాజీ క్రికెటర్, తెహ్రికే ఏ ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్, మత పెద్ద ఖాద్రీ నేతృత్వంలో నిరసనకారులు ఆందోళనను ఉద్ధృతం చేశారు. ఇస్లామాబాద్ లోని సచివాలయ గేట్ ను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. సచివాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, ఆగ్రహించిన ఆందోళనకారులు పోలీసులపై రాళ్ల వర్షం కురిపించారు. వారిని నిలువరించడానికి పోలీసులు లాఠీ ఛార్జ్ నిర్వహించారు. దీంతో పలువురు గాయపడ్డారు.

  • Loading...

More Telugu News