: మద్యంపై రాద్ధాంతం చేస్తున్న టీడీపీ మద్యనిషేధానికి సిద్దమా?: జ్యోతుల నెహ్రూ


మద్యంపై రాద్ధాంతం చేస్తున్న టీడీపీ మద్యనిషేధానికి సిద్దమా? అని వైఎస్సార్సీపీ నేత జ్యోతుల నెహ్రూ సవాలు విసిరారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో నకిలీ మద్యం సరఫరాపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహానుభావుడు ఎన్టీఆర్ జాడలో నడుస్తామని చెబుతున్న టీడీపీ, రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధానికి సిద్ధంగా ఉందా? అని సవాలు విసిరారు. పార్టీని, వ్యక్తుల్ని లక్ష్యంగా చేసుకుని విమర్శించడం కాకుండా, సమాజానికి మంచి చేయాలని ఆయన హితవు పలికారు.

  • Loading...

More Telugu News