: శాసన సభలో నకిలీ మద్యంపై రగడ


మూడు రోజుల విరామానంతరం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాల్లో భాగంగా, ప్రశ్నోత్తరాల సమయంలో నకిలీ మద్యం రవాణాపై చర్చ ప్రారంభమైంది. దీంతో, వైఎస్సార్సీపీ, టీడీపీ సభ్యుల మధ్య ఈ అంశంపై దుమారం రేగింది. 'మీరు నకిలీ మద్యం వ్యాపారం చేస్తున్నారు'అని వైఎస్సార్సీపీ సభ్యులు ఆరోపిస్తుండగా, 'మీరే నకిలీ మద్యం సరఫరా చేస్తున్నారు'అంటూ టీడీపీ సభ్యులు మండిపడ్డారు. ఎన్నికల సందర్భంగా వైఎస్సార్సీపీ నేతలు పంపిణీ చేసిన మద్యంలో ప్రాణాంతక క్రిమి సంహారక మందుల అవశేషాలు లభ్యమయ్యాయని ధూళిపాళ్ల నరేంద్ర గుర్తుచేశారు. దీనిపై వైఎస్సార్సీపీ నేతలు స్పందిస్తూ, మద్యం వ్యాపారంతోనే పలువురు టీడీపీ నేతలు వృద్ధి చెందుతున్నారని ఆరోపించారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ నేతలు మద్యం సరఫరా చేశారని అన్నారు. దీనిపై ప్రత్యేక టాస్క్ ఫోర్సు బృందం ఏర్పాటు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News