: మూత్ర విసర్జన చేశాడని కొట్టడంతో బాలుడు మరణించాడు


పెద్దల మధ్య వివాదం పిల్లాడి ఉసురు తీసింది. క్షణికావేశం పసివాడి జీవితాన్ని బలి తీసుకుంది. కర్నూలు జిల్లా ఆలూరు మండలం పెద్ద హోతూరులో చోటుచేసుకున్న దారుణం వివరాల్లోకి వెళ్తే... చిన్నకుట్టి, గంగాధర్ కుటుంబాలు పక్క పక్కనే నివాసం ఉంటున్నాయి. ఈ రెండు కుటుంబాల మధ్య చిన్న చిన్న వివాదాలు ఉన్నాయి. ఇవేవీ పట్టని గంగాధర్ కుమారుడు వినోద్ (4) చిన్నకుట్టి ఇంటి ఆవరణలో మూత్ర విసర్జన చేశాడు. దీనిని గమనించిన చిన్నకుట్టి ఆగ్రహంతో బాలుడి చెంపపై బలంగా కొట్టాడు. దీంతో, చిన్నారి అక్కడికక్కడే పడిపోయాడు. దానిని గమనించిన తల్లిదండ్రులు వినోద్ ను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో, లబోదిబోమంటూ బాలుడి మృతదేహంతో అతని తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. చిన్నకుట్టిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News