: మా పాఠశాలల్లోనూ మీ భాష ను బోధించండి: జపాన్ టీచర్లకు మోడీ ఆహ్వానం
‘‘జపనీస్ భాషను మా స్కూళ్లలోనూ ప్రవేశపెట్టాలనుకుంటున్నాం. అందుకోసం టీచర్లు కావాలి. మీ భాషను మా స్కూళ్లలో బోధించేందుకు రండి’’ అంటూ ప్రధాని నరేంద్ర మోడీ జపనీస్ టీచర్లకు ఆహ్వానం పలికారు. జపాన్ పర్యటనలో భాగంగా సోమవారం తైమీ ఎలిమెంటరీ స్కూల్ ను సందర్శించిన మోడీ, అక్కడి పిల్లలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మోడీ చేసిన వ్యాఖ్యలను ప్రధాని ట్విట్టర్ అకౌంట్ లో పీఎంఓ పోస్ట్ చేసింది. ఇరు దేశాల మధ్య వాణిజ్య, రక్షణ, వైద్య రంగాల్లోనే కాక భాషా సంబంధిత బంధాలను బలపరుచుకుందామన్న రీతిలో మోడీ చేసిన వ్యాఖ్యల పట్ల జపనీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.