: నిండు కుండలా హిమాయత్ సాగర్... గేట్లు ఎత్తివేసే అవకాశం
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో హిమాయత్ సాగర్ కు భారీ ఎత్తున వరదనీరు వచ్చి చేరుతోంది. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు హిమాయత్ సాగర్ ప్రాజెక్టును ముంచెత్తాయి. దీంతో ప్రాజెక్టులోకి 11,656 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. దీంతో ప్రాజెక్టులో 1752 అడుగుల నీటిమట్టం నమోదైంది. ప్రాజెక్టు నిండిపోతుండడంతో గేట్లు తెరిచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.