: బాపు మృతికి సంతాపం తెలిపిన ప్రవాస భారత సంఘాలు
ప్రముఖ చలన చిత్ర దర్శకుడు బాపు మృతిపై అమెరికాలోని ప్రవాస భారత సంఘాలన్నీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. తెలుగు జాతికి గర్వకారణంగా నిలిచే చిత్రాలు గీసిన, తీసిన బాపు మృతి తెలుగు ప్రజలకు తీరని లోటని ఆయా సంఘాలు పేర్కొన్నాయి. బాపు మరణ వార్త తమను తీవ్రంగా కలచివేసిందని పలువురు పేర్కొన్నారు. కళామతల్లి ముద్దుబిడ్డగా ఆయన ప్రాణం పోసిన పాత్రలు బుడుగు, సీగాన పెసూనాంబ, రెండుజెళ్ల సీత, అందమైన ఆడపిల్లగా(బాపుబొమ్మ) ఆయన ప్రతి తెలుగింట కొలువై ఉంటారని పలువురు పేర్కొన్నారు. ఆయన భౌతికంగా మనల్ని వదిలి వెళ్లినా తెలుగుజాతి స్మృతి పథంలో ఆయన చిరస్థాయిగా నిలిచి ఉంటారని ఆయా సంఘాలు పేర్కొన్నాయి.