: వినాయకుడిపై వ్యాఖ్యల పట్ల వర్మ క్షమాపణలు
గణేశ్ చతుర్ధి ఏ సందర్భంలో జరుపుకుంటారంటూ ట్విట్టర్ లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యల పట్ల దర్శకుడు రాంగోపాల్ వర్మ క్షమాపణలు తెలిపారు. తన ట్వీట్ల వెనుక ఎలాంటి ఉద్దేశం లేదని వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యల పట్ల ఎవరైనా బాధపడి ఉంటే వారికి తాను క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు. కాగా, వ్యాఖ్యలకు సంబంధించి వర్మపై నాంపల్లి కోర్టులో పిటిషన్ వేయగా, సరూర్ నగర్ పీఎస్ లో కేసు నమోదైంది.