: అమితాబ్ కు తీవ్ర జ్వరం... షూటింగులు క్యాన్సిల్
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో, ఆయన నటించే చిత్రాల షూటింగులను క్యాన్సిల్ చేశారు. తనకు అనారోగ్యంగా ఉన్నట్టు అమితాబ్ ట్విట్టర్ లో తెలిపారు. జ్వరం తగ్గలేదని పేర్కొన్నారు. షూటింగులు క్యాన్సిల్ అవడం బాధ కలిగిస్తోందని అన్నారు.