: బాపు ఎక్కడికీ వెళ్ళలేదు: చంద్రమోహన్
ప్రముఖ దర్శకుడు బాపు మరణించడం పట్ల సీనియర్ నటుడు చంద్రమోహన్ స్పందించారు. బాపు ఎక్కడికీ వెళ్ళలేదని, మన మధ్యే ఉన్నారని వ్యాఖ్యానించారు. గీసిన బొమ్మల్లో, తీసిన చిత్రాల్లో ఆయన సజీవంగానే ఉన్నారని పేర్కొన్నారు. భౌతికంగా లేకపోయినా, తన కళ ద్వారా బాపు బతికే ఉంటారని తెలిపారు. తెలుగు సినిమా ఉన్నంతకాలం బాపు ఉంటారని చంద్రమోహన్ చెప్పారు. ఆయన తీసిన 'బంగారుపిచ్చుక' సినిమాలో తాను నటించానని తెలిపారు.