: ఒక ధ్రువతార నేలరాలింది: చంద్రబాబు
తెలుగు చిత్రసీమ గర్వించదగ్గ దర్శకుడు బాపు మృతి చెందడం పట్ల సీఎం చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. తన సంతాపం తెలియజేశారు. ఆయన మరణం తెలుగు ప్రజలకు, సినీ పరిశ్రమకు తీరని లోటు అని పేర్కొన్నారు. ఆయన మరణంతో ఒక ధ్రువతార నేలరాలిందని వ్యాఖ్యానించారు. బాపు రేఖా చిత్రాలు... తెలుగు ప్రజల జీవితానికి ప్రతీకలని అభివర్ణించారు.