: ఆయనెంతో మర్యాదస్తుడు: రామానాయుడు
బాపు గుండెపోటుతో మరణించడం పట్ల ప్రముఖ నిర్మాత రామానాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాపుతో తనకు కొద్దిపాటి పరిచయం మాత్రమే ఉందని, అయితే, ఆయనెంతో మర్యాదస్తుడని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తి మరొకరు లేరని, ఎంతో సంస్కారం ఉన్న వ్యక్తని అభిప్రాయపడ్డారు. తమ బ్యానర్లో సినిమా తీయాలని బాపును అడిగానని రామానాయుడు గుర్తు చేసుకున్నారు.