: కూకట్ పల్లి వివేకానందనగర్ బస్ స్టాప్ లో మహిళను గొంతుకోసి హత్య చేసిన దుండగులు


హైదరాబాద్ కూకట్ పల్లిలోని వివేకానందనగర్ బస్ స్టాప్ లో ఈ రోజు ఉదయం దారుణ సంఘటన చోటుచేసుకుంది. బస్ స్టాప్ లో నిలుచుని ఉన్న మహిళపై దుండగులు దాడి చేశారు. అనంతరం ఆమె గొంతుకోసి హత్య చేశారు. దాంతో ఆమె రక్తపు మడుగులో పడి ప్రాణాలు విడిచింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News