: యూపీలో బాలిక కిడ్నాప్, ఆపై సామూహిక అత్యాచారం


ఉత్తరప్రదేశ్ లో అత్యాచారాల పర్వం కొనసాగుతూనే ఉంది. పాఠశాలకు వెళ్లి వస్తున్న ఓ 14 ఏళ్ల బాలికను అపహరించిన నలుగురు దుండగులు ఆ తర్వాత బాలికపై సామూహిక అత్యాచారం జరిపారు. బారాబంకీలోని రామ్ నగర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జరిగిన ఘోరాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రంగంలోకి దిగిన ప్రత్యేక పోలీసు బృందాలు ఎట్టకేలకు ముగ్గురు నిందితులు అక్బర్, జబ్బీర్, ఈబ్బాల్ లను అరెస్ట్ చేసినట్లు జిల్లా అదనపు ఎస్పీ కులదీప్ నారాయణ్ తెలిపారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేశారు. బాధిత బాలికను వైద్య పరీక్షల నిమిత్తం బారాబంకీ ఆస్పత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News