: పంతం నెగ్గించుకున్న కేసీఆర్... మెట్రో రైల్ అలైన్మెంట్ మార్పు కోసం 400 కోట్లు కేటాయింపు


హైదరాబాద్ మెట్రో రైల్ తన దిశను మార్చుకోబోతోంది. మెట్రో రైల్ అలైన్ మెంట్ మార్పుపై కేసీఆర్ చాలా పట్టుదలగా ఉండడంతో స్వల్పమార్పులతో పట్టాలెక్కేందుకు రెడీ అవుతోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆలోచనకు అనుగుణంగా చారిత్రక కట్టడాలకు ఏమాత్రం భంగం కలగకుండా... వాటికి కాస్త దూరం నుంచి వెళ్లేలా... అధికారులు కొత్త రూట్ మ్యాప్ ను సైతం సిద్ధం చేశారు. మెట్రో రైల్ కోసం చారిత్రక కట్టడాలను కూల్చడంగాని... వాటికి నష్టం చేయడాన్నిగాని కేసీఆర్ మొదటినుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నారు. కేసీఆర్ సలహా ప్రకారమే రవీంద్రభారతి...అసెంబ్లీల మీదుగా వెళ్లాల్సిన మెట్రో రూటును నాంపల్లిలో మొదలుకుని... తెలుగు యూనివర్శిటీ వెనుక భాగం నుంచి పబ్లిక్ గార్డెన్స్ మీదుగా లక్డీకాపూల్ చేరుకునేలా ఆలైన్ మెంట్ మార్చనున్నారు. అలాగే సుల్తాన్ బజార్ మీదుగా వెళ్లాల్సిన రూట్ ను కోటి ఉమెన్స్ కాలేజ్ వెనుక నుంచి తీసుకువచ్చి... బాటా జంక్షన్ ఎడమవైపుగా కాచిగూడాకు తీసుకురానున్నారు. మెట్రో అలైన్ మెంట్ మార్పు వల్ల... 'ఎల్ అండ్ టి'కి కలిగే నష్టానికి, కొత్త అలైన్ మెంట్ కు అయ్యే అదనపు ఖర్చు కోసం కేసీఆర్ 400 కోట్లు కేటాయించారు. ఇప్పటికే లక్డీకాపూల్, సుల్తాన్ బజార్ ప్రాంతాల్లో మెట్రో తన పనులను నిలిపివేసింది. రీ అలైన్ మెంట్ కారణంగా లక్డీకాపూల్, గన్ పార్క్, అసెంబ్లీ, రూట్లలో వేసిన సుమారు 21 పిల్లర్లను తొలగించాల్సి వస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ హైదరాబాద్ మెట్రో రైల్ అధారిటీ అధికారులతో చర్చించారు.

  • Loading...

More Telugu News