: ఆన్ లైన్ లో భూముల క్రయవిక్రయాలు: కేఈ కృష్ణమూర్తి


రాష్ట్రంలో త్వరలో భూముల క్రయ విక్రయాలను ఆన్ లైన్ లో చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి చెప్పారు. ఆదివారం తిరుమల వచ్చిన ఆయన శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సందర్భంగా రెవెన్యూ సంబంధిత అంశాలను ప్రస్తావించారు. ఆస్తులు, భూముల రిజిష్ట్రేషన్లను సులభతరం చేసేందుకు ఆన్ లైన్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ముమ్మర కసరత్తు జరుగుతోందన్నారు. రాజధానిగా కర్నూలును మించిన నగరం మరొకటి లేదని, సర్కారీ భూముల వివరాలతో మరీ వాదించిన ఆయన తాజాగా మాట మార్చారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమాన దూరంలోని ప్రాంతాన్ని రాజధానిగా ఏర్పాటు చేయడమే మేలని పేర్కొన్నారు. అయితే రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలను సమానంగా అభివృద్ది చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈ దిశగానే తమ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని కేఈ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News