: తమిళనాడులో ఘోరప్రమాదం... టూరిస్ట్ బస్సులో పేలిన గ్యాస్ సిలిండర్... ఐదుగురు సజీవ దహనం!
తమిళనాడులో ఈ తెల్లవారుజామున ఘోరప్రమాదం జరిగింది. రామనాథపురంలోని కీళ్లకరై ప్రాంతం దగ్గర ఓ ప్రైవేటు బస్సులోని గ్యాస్ సిలిండర్ పేలి ఐదుగురు సజీవ దహనం అయ్యారు. 11 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులకు రామనాథపురం ఏరియా ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. మృతులను బెంగాల్ వాసులుగా పోలీసులు గుర్తించారు. వీరంతా...రామేశ్వరం ఆలయాన్ని సందర్శించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్ పేలడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది.