: 'సూపర్ ఫ్యాన్'ను ఎంపిక చేసిన మహేష్ బాబు


‘ఆగడు’ ఆడియో వేడుక సందర్భంగా మహేష్ బాబు అభిమానుల కోసం ఓ కాంటెస్ట్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా మహేష్ అభిమానుల నుంచి 12 మందిని ఎంపిక చేసి ఈ ఆడియో ఫంక్షన్ కు ఆహ్వానించారు. ఆ 12 మందికి మహేష్ బాబు సినిమాలకు సంబంధించిన ప్రశ్నలను కార్యక్రమ వ్యాఖ్యాత ఝాన్సీ అడిగారు. సరైన సమాధానాలు చెప్పిన నలుగురు అభిమానులను ఎంపిక చేశారు. చివరికి సూపర్ ఫ్యాన్ ను మహేష్ బాబు సెలక్ట్ చేశారు. మహేష్ సినిమాల్లో ఎక్కువగా చూసిన సినిమా ఏది? అన్న ప్రశ్నకు సమాధానమిచ్చిన వారిని సూపర్ ఫ్యాన్ వరించింది. ప్రణీతను సూపర్ ఫ్యాన్ గా ఝాన్సీ ఈ వేదికపై ప్రకటించారు. విజేతకు వాన్ మొబైల్ ను బహుమతిగా ఇవ్వనున్నారు.

  • Loading...

More Telugu News