: ‘వన్’ తర్వాత మహేష్ బాబు ఇక ‘ఆగడు’: సుకుమార్
మహేష్ బాబుతో ‘వన్... నేనొక్కడినే’ సినిమా చేసిన దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ... మహేష్ బాబు ఇక ‘ఆగడు’ అని అన్నారు. ఆ సినిమా తర్వాత మహేష్ బాబు తనతో మళ్లీ సినిమా ఎప్పుడు చేద్దామని అడిగారని సుకుమార్ చెప్పారు. అంతటి సహృదయుడు మహేష్ బాబు అని ఆయన అన్నారు. ఈ సినిమా తప్పకుండా ఘనవిజయం సాధిస్తుందని ఆయన చెప్పారు. ‘ఆగడు’ సినిమాలోని ఓ పాటను ఆయన విడుదల చేశారు.