: ముగిసిన తొలివిడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు
ఎంసెట్ కౌన్సిలింగ్ లో భాగంగా తొలివిడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు పూర్తయ్యింది. ఆంధ్రప్రదేశ్ లో 62,917 ఇంజినీరింగ్ సీట్లు, తెలంగాణలో 52,709 సీట్లు కేటాయించారు. ఏపీలో మిగిలిన సీట్లు 53,996 కాగా, తెలంగాణలో 12,447 సీట్లు మిగిలాయి. ఏపీలో 326, తెలంగాణలో 149 కాలేజీల్లో సీట్ల కేటాయింపు జరిగింది. సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి ఇంజినీరింగ్ క్లాసులు ప్రారంభమవుతున్నాయి.