: హైదరాబాదు శిల్పకళావేదికలో ‘ఆగడు’ ఆడియా వేడుక
మహేష్ బాబు తాజా చిత్రం ‘ఆగడు’ సినిమా ఆడియో వేడుక మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. హైదరాబాదు మాదాపూర్లోని శిల్పకళావేదికలో జరుగుతోన్న ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి మహేష్ బాబు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించిన ఈ సినిమాకు శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. ‘దూకుడు’ తర్వాత మహేష్ బాబు, శ్రీను వైట్ల కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.