: రాజధానిపై తుది నిర్ణయం ముఖ్యమంత్రిదే: మంత్రి దేవినేని ఉమ


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయంపైనే రాజధాని ఏర్పాటు ఆధారపడి ఉంటుందని నీటిపారుదల, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ చెప్పారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, రాజధాని ఏర్పాటుపై కేబినెట్‌లో చర్చిస్తామన్నారు. కృష్ణా ట్రైబ్యునల్‌ బోర్డు ఏర్పాటుపై తుది నిర్ణయం కేంద్రానిదేనని ఆయన తెలిపారు. ఎస్‌ఆర్‌బీసీ, హంద్రీనీవా, సిద్ధాపురం లిప్ట్ ఇరిగేషన్‌ పనులు సాధ్యమైనంత తొందరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రాయలసీమలో తాగునీటికి తీవ్రమైన సమస్య ఉందన్నారు. దీని పరిష్కారానికి కృషి చేస్తామని ఉమ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News