: పట్టపగలు మూడు కేజీల బంగారం దోచేశారు
హైదరాబాదులోని రెండు చోట్ల భారీ చోరీలు జరిగాయి. నారాయణగూడలో పట్టపగలు ఓ ఇంటితాళాలు పగులగొట్టిన దొంగలు అందులోని కేజీ బంగారం దొంగిలించారు. సైదాబాదులో రెండు కేజీల బంగారం కొల్లగొట్టారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.