: రాంగోపాల్ వర్మపై నాంపల్లి కోర్టులో పిటిషన్
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మపై హైదరాబాదులోని నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇటీవల రాంగోపాల్ వర్మ వినాయకుడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి సభ్యులు ఫిర్యాదు చేశారు. వర్మపై కఠిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదిలా ఉంచితే, దేవుడిని దూషించడం తప్పేనన్న వర్మ, తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని, క్షమాపణ కోరారు.