: జిల్లా కోర్టులో లొంగిపోయిన మెదక్ బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డి
మెదక్ జిల్లా బీజేపీ ఎంపీ అభ్యర్థి, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్థానిక కోర్టులో లొంగిపోయారు. 2011-12లో సదాశివపేట పట్టణంలో జరిగిన ఓ కార్యక్రమంలో నర్సింహులు అనే వ్యక్తి రేషన్ బియ్యం బాగోలేవని ఆరోపించడంతో ఎమ్మెల్యేగా ఉన్న జగ్గారెడ్డి అతనిపై చేయి చేసుకున్నారు. ఆ తరువాత జేఏసీ నేతలు జగ్గారెడ్డి కాన్వాయ్ ను అడ్డుకున్నారు. వారిపై కూడా జగ్గారెడ్డి చేయిచేసుకున్నారు. ఈ రెండు కేసుల్లో జగ్గారెడ్డిపై అరెస్టు వారెంట్ జారీ అయింది. ఈ కేసుల్లో జగ్గారెడ్డి కోర్టులో లొంగిపోయినట్టు సంగారెడ్డి డీఎస్పీ తెలిపారు.