: బ్లడ్ గ్రూప్ మారింది ... స్వరూప ప్రాణం పోయింది!
కరీంనగర్ ప్రభుత్వాసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. సిరిసిల్లకు చెందిన స్వరూప అనే మహిళ జ్వరంతో పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలో జాయిన్ అయింది. ఆమెకు రక్త పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమె రక్తహీనతతో బాధపడుతోందనీ, ఆమె బ్లడ్ గ్రూప్ 'ఓ' పాజిటివ్ అని నిర్ధారించారు. అయితే, ఇక్కడే వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. ఆమెకు 'ఓ' పాజిటివ్ రక్తం ఎక్కించాల్సిన వైద్యులు 'ఏబీ' పాజిటివ్ రక్తం ఎక్కించారు. దీంతో ఆమె పరిస్థితి విషమించి దుర్మరణం పాలైంది. ఈ పరిణామంతో, వైద్యులే స్వరూపను చంపేశారంటూ ఆమె బంధువులు ఆందోళన చేస్తున్నారు. దీనిపై విచారణ చేస్తున్నామని, దోషులను శిక్షిస్తామని వైద్యాధికారులు తెలిపారు.