: సీటు తీసుకుని వద్దంటే లక్ష కట్టాల్సిందే!


మెడికల్ కౌన్సెలింగ్ లో కొత్త నిబంధన వచ్చి చేరింది. దీని ప్రకారం సీటు తీసుకున్నాక దాన్ని రద్దు చేసుకుంటే లక్ష రూపాయల అపరాధ రుసుం కట్టాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ లక్ష రూపాయల నిబంధనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండో కౌన్సెలింగ్ లో తమ పిల్లలకు మంచి కాలేజీలో సీటు వస్తే దాన్ని మార్చుకోవడం తప్పా? అని ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మెడికల్ కౌన్సెలింగ్ ప్రారంభమైంది. రెండు రాష్ట్రాల్లో కౌన్సెలింగ్ కు విద్యార్థులు ఉత్సాహంగా హాజరయ్యారు. ఎంసెట్ మెడికల్ విభాగంలో 19వ ర్యాంకు వచ్చిన డీనా కౌన్సెలింగ్ కు ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకురాకపోవడంతో అధికారులు అడ్మిషన్ ఇచ్చేందుకు నిరాకరించారు. మరోవైపు ప్రభుత్వ కళాశాలల మెడికల్‌ సీట్లలో 15% ఎన్‌ఆర్‌ఐ కోటాను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్‌యూ విద్యార్థి నేతలు ఆందోళన నిర్వహిస్తున్నారు.

  • Loading...

More Telugu News