: వినాయకుడి ప్రతిమతో పాటు కేసీఆర్ విగ్రహం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మెదక్ జిల్లా పటాన్ చెరుకు చెందిన యువకులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. పటాన్ చెరులో ఏర్పాటు చేసిన 36 అడుగుల వినాయక విగ్రహం పక్కనే... కేసీఆర్ మట్టి ప్రతిమను కూడా ఏర్పాటు చేశారు. 60 ఏళ్ల తమ తెలంగాణ రాష్ట్ర కలను కేసీఆర్ నెరవేర్చారని... ఆయన తమ గుండెల్లో ఉన్నారని... అందుకే ఆయన ప్రతిమను వినాయక మండపంలో ఏర్పాటు చేశామని యువకులు చెబుతున్నారు.