: ప్రమాదకర స్థాయికి సీలేరు జలాశయాల నీటిమట్టం
విశాఖపట్నం జిల్లాలోని సీలేరు జలాశయాల నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. గత రెండు రోజులుగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో సీలేరు పరిధిలోని ఐదు జలాశయాల నీటిమట్టం పూర్తి స్థాయికి చేరుకుంది. దీంతో, డొంకరాయి జలాశయం గేట్లను 2 అడుగుల మేర ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మిగిలిన జలాశయాల గేట్లను కూడా ఎత్తివేసే ఆలోచనలో అధికారులు ఉన్నారు.