: బీజేపీ ఎమ్మెల్యే ఇంట్లో యువకుడి మృతదేహం
మధ్యప్రదేశ్ లోని బీజేపీ ఎమ్మెల్యే ఇంట్లో ఓ యువకుడి మృతదేహం అనుమానాస్పద రీతిలో లభ్యమైంది. ఎంపీలోని పృధ్వీపూర్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అనితా నాయక్ నివాసంలో మనోజ్ ధీమార్ (24) మృతదేహం లభ్యమైందని టికమ్ ఘడ్ పోలీసులు తెలిపారు. ఆ యువకుడు జతరా పట్టణంలోని ఎమ్మెల్యే ఇంటికి తరచూ వస్తూ ఉండేవాడని పోలీస్ అధికారి వెల్లడించారు. కాగా, ఆ యువకుడు చెట్టుపై నుంచి పడి మృతి చెందినట్టు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం పంపామని, వివరాలు అందిన తరువాత విచారణ చేస్తామని పోలీసులు తెలిపారు.