: పెళ్లికి ముందు సహజీవనమన్నాడు...ఆ ముచ్చట తీరాక గెంటేశాడు


పాశ్చాత్య నాగరికత మోజు భారతీయ సంస్కృతికి పెను సవాలుగా నిలుస్తోంది. ఈ మోజులో పడితే విలువలు ఎలా నశిస్తాయో, భారతీయ సమాజాన్ని హెచ్చరించే సంఘటన హర్యానాలోని ఫరీదాబాద్ లో చోటుచేసుకుంది. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి సహజీవనం చేసిన యువకుడు ఆ తంతు కాస్త ముగిశాక తనను గెంటేశాడని ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. తనతో పాటు కళాశాలలో చదువుతున్న అనిల్ (22) అనే యువకుడితో ఓ యువతి ఎస్జీఎం నగర్ ప్రాంతంలో ఓ అద్దె ఫ్లాట్ లో సహజీవనం చేస్తోంది. ఈ సమయంలో అనిల్ తనపై చాలా సార్లు అత్యాచారం చేశాడని, తరువాత తనను దూషించి ఇల్లు ఖాళీ చేయాలని చెప్పాడని, తనను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడని పోలీసులను ఆశ్రయించింది. అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న అతని కోసం గాలింపు చేపట్టారు.

  • Loading...

More Telugu News