: బంధానికి అడ్డొచ్చాడని ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది


వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి కట్టుకున్న భర్తను ఓ భార్య తన ప్రియుడితో కలిసి కొట్టి చంపేసింది. కాన్పూర్ సమీపంలోని బిధ్ను ప్రాంతానికి చెందిన ప్రేమ్ కుమార్ రాజ్పుత్ కు సంగీత అనే మహిళతో వివాహం జరిగింది. ఆమెకు అభిషేక్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. విషయం గమనించిన ప్రేమ్ కుమార్ ఆమెను హెచ్చరిస్తుండడంతో అతడిని ప్రేమికులిద్దరూ కలిసి కొట్టి చంపేశారు. అనంతరం తన భర్త అనారోగ్యంతో మరణించాడంటూ సంగీత అంత్యక్రియలకు సిద్ధం చేస్తుండగా, తస్లీంపూర్లో నివాసముండే రాజ్ కుమార్ సోదరి తన సోదరుడి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా భావించి శవాన్ని పోస్టుమార్టంకు పంపారు. దీంతో అతని శరీరంపై గాయాలు కనిపించాయి. ఇంటి గోడలపై కూడా రక్తపు మరకలు దర్శనమివ్వడంతో పోలీసులు, సంగీతను అదుపులోకి తీసుకుని విచారించారు. తన ప్రియుడు అభిషేక్తో వివాహేతర సంబంధానికి నిరాకరించడంతో తామిద్దరం కలిసి భర్తను కొట్టి చంపినట్లు ఆమె అంగీకరించింది.

  • Loading...

More Telugu News