: పాతికేళ్లుగా ఆమే రారాణి!
పాతకేళ్లు అప్రతిహతంగా విజయపథాన నిలుస్తూ ఆ పార్టీకి ఆమె రారాణిగా వెలుగొందుతున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఏఐఏడీఎంకే జనరల్ సెక్రటరీగా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ శ్రేణులు జయలలితను ఈ అత్యున్నత పదవికి నామినేట్ చేసేందుకు పోటీపడ్డాయి. దీంతో, పార్టీ ఫీజు రూపేణా రూ.6 కోట్లకు పైగా ఫండ్ సమకూరింది. జయలలితను నామినేట్ చేసేందుకు 2,467 మంది కార్యకర్తలు పోటీపడ్డారు. నామినేట్ చేసేందుకు ఒక్కరు చెల్లించాల్సిన ఫీజు 25 వేల రూపాయలు. దీంతో 6 కోట్ల రూపాయలకు పైగా నిధి సమకూరింది. కాగా, 1982లో జయలలిత ఏఐఏడీఎంకేలో చేరారు. 89లో ఆమె పార్టీ జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె అప్రతిహతంగా విజయం సాధిస్తున్నారు.