: డ్రోన్లు... గూగుల్ సరికొత్త రవాణా వాహనాలు
సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ఇప్పటికే పలు రంగాల్లో సత్తా చాటింది. డ్రైవర్ రహిత కార్లు, స్మార్ట్ ఫోన్లు, విప్లవాత్మక గూగుల్ గ్లాస్... ఇలాంటివే కాకుండా, సరకు రవాణా కోసం డ్రోన్లు (మానవరహిత విమానాలు) ను వినియోగించాలని తలపోస్తోంది. ఈ క్రమంలో డ్రోన్లను విజయవంతంగా పరీక్షించింది. ఆస్ట్రేలియాలోని క్వీన్స్ లాండ్ లో ఇద్దరు రైతులకు తినుబండారాలు, నీరు, మందులు, పెంపుడు కుక్కల ఆహారం తదితరాలను ఈ డ్రోన్ల ద్వారా అందించారు. సరకు రవాణాలో ఇదో సరికొత్త పంథా అని గూగుల్ తన బ్లాగులో పేర్కొంది. దీనిపై గూగుల్ వర్గాలు రెండేళ్ళపాటు పరిశోధనలు సాగించాయి. కాగా, ఇంటర్నెట్లో రిటైల్ అమ్మకాల దిగ్గజం అమెజాన్. కామ్ కూడా ఇదే తరహాలో డ్రోన్లను పరీక్షించడం తెలిసిందే.