: వీళ్ళకి సైన్యం చెబితేనే సరి!


పాకిస్థాన్ లో గత కొన్ని వారాలుగా కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం క్లైమాక్స్ కు చేరింది. ప్రధాని నవాజ్ షరీఫ్ గద్దె దిగాల్సిందేనంటూ పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్, పాకిస్థాన్ అవామీ తెహ్రీక్ (పీఏటీ) అధ్యక్షుడు తాహిర్-ఉల్-ఖాద్రి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం తెలిసిందే. ప్రభుత్వంతో వీరి చర్చలు అనుకున్నంతమేర సఫలం కాకపోవడంతో ఉద్యమం మరింత తీవ్రమైంది. ఈ దశలో పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్ జోక్యం చేసుకోకతప్పలేదు. పరిస్థితి చక్కదిద్దాలంటూ పీఎంఎల్-ఎన్ సర్కారు కోరిన మీదట రహీల్ మధ్యవర్తిగా రంగంలోకి దిగారు. ఈ మేరకు ఇమ్రాన్ ఖాన్ తో చర్చించారు. ప్రభుత్వంతో చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. జనరల్ రహీల్ తో భేటీ అనంతరం ఇమ్రాన్ మాట్లాడుతూ, తాజా సంక్షోభంలో ఆర్మీ 'న్యూట్రల్ అంపైర్' పాత్ర పోషిస్తుందని తెలిపారు. కాగా, ఆర్మీ సూచనలను ఇమ్రాన్ ఖాన్, తాహిర్ లు తప్పక పాటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాక్ లో సైన్యం శక్తి ఏపాటిదో చరిత్ర చక్కగా చెబుతుంది. అందుకే, సైన్యం మాట జవదాటేందుకు ఈ నేతలు సాహసించకపోవచ్చు. 1977, 1999 రాజకీయ సంక్షోభాలు సైనిక చర్యతోనే అంతమయ్యాయి. ఎన్నికల ఫలితాలపై రాజకీయవర్గాలు విభేదించగా 1977లో జనరల్ జియావుల్ హక్ సైనిక పాలన విధించగా... 1999లో నవాజ్ షరీఫ్ ను తొలగించి పర్వేజ్ ముషారఫ్ మిలిటరీ రూలింగ్ కు తెరదీశాడు.

  • Loading...

More Telugu News