: అవినీతి లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతా: కేసీఆర్


అవినీతిని జీరో స్థాయికి రప్పించి చూపిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. హైటెక్స్ లో క్రిడాయి ప్రాపర్టీ షోను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ... హైదరాబాదులో అభివృద్ధి జరగాల్సిన పద్ధతిలో జరగలేదని అన్నారు. కొన్నేళ్లలో హైదరాబాదు ఊహించనంతగా అభివృద్ధి చెందుతుందని ఆయన చెప్పారు. త్వరలో హైదరాబాదులో రియల్టర్లతో సమావేశం ఏర్పాటు చేస్తానని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోనే ఉత్తమ సింగిల్ విండో విధానాన్ని ప్రవేశపెడతామని ఆయన చెప్పారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రోడ్లు వేస్తామని ఆయన అన్నారు. సింగపూర్ లాంటి దేశాల్లో అవినీతి ఉండదన్నారు. కానీ, మన సమాజంలో అతి పెద్ద జబ్బు లంచం అని ఆయన చెప్పారు. అవినీతి లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామని ఆయన అన్నారు. వ్యాపార, వాణిజ్య రంగాలకు హైదరాబాదు అనువైన ప్రాంతమని, హైదరాబాదు లాంటి వాతావరణం దేశంలో మరెక్కడా ఉండదని ఆయన అన్నారు. ఇక్కడ పనిచేసి రిటైరైన ఉద్యోగులు హైదరాబాదును విడిచి వెళ్లరని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News