: మరో దారుణానికి తెగబడ్డ 'ఐఎస్ఐఎస్'
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) తీవ్రవాదులు మరో దారుణానికి తెగబడ్డారు. సిరియాలోని రక్కా ప్రావిన్స్ ఎయిర్ బేస్ పై దాడిచేసి భారీ సంఖ్యలో సైనికులను బందీలుగా పట్టుకోగా... వారిని నిర్దాక్షిణ్యంగా కాల్చిచంపిన దృశ్యాలతో కూడిన ఓ వీడియోను ఐఎస్ఐఎస్ తాజాగా విడుదల చేసింది. ఒంటిపై అండర్ వేర్లు మాత్రమే ఉన్న రీతిలో, పదులకొద్దీ శవాలు పడి ఉండడం ఆ వీడియోలో కనిపించింది. తాము చంపినవారి సంఖ్య 250 అని ఈ వీడియోలో ఓ క్యాప్షన్ కూడా ఉంచారు.