: వినాయకుని ఆశీస్సులు మనకెప్పుడూ ఉంటాయి: ప్రధాని
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ‘వినాయక చతుర్థి రోజున మనమంతా ప్రథమ పూజితుడిని కొలుస్తాం. వినాయకుని ఆశీస్సులు మనకెప్పుడూ ఉంటాయి. మన జీవితాలు శాంతి, సౌఖ్యం, వివేకాలతో వర్థిల్లేలా గణనాథుడు చల్లని చూపు చూస్తాడు. దీవెనలు అందిస్తాడు’ అని మోడీ ట్విట్టర్ లో పేర్కొన్నారు.