: వచ్చే వారం భారత్ రానున్న ఆస్ట్రేలియా ప్రధాని
వచ్చేవారం తాను భారత్ లో పర్యటించనున్నట్టు ఆస్ట్రేలియా ప్రధానమంత్రి టోనీ అబ్బాట్ తెలిపారు. ఈ సందర్భంగా భారత్ కు యురేనియం సరఫరా ఒప్పందంపై సంతకం చేయనున్నట్టు వెల్లడించారు. కాగా, ప్రధాని పగ్గాలు చేపట్టిన తర్వాత అబ్బాట్ భారత్ రానుండడం ఇదే ప్రథమం. ఢిల్లీ, ముంబయి నగరాల్లో ఆయన పర్యటన సాగనుంది. దీనిపై అబ్బాట్ మాట్లాడుతూ, తన పర్యటన ద్వారా రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. పరస్పర ఆసక్తుల విషయంలో ముందంజ వేసేందుకు మోడీతో భేటీని ఓ అవకాశంగా భావిస్తున్నామని ఆయన తెలిపారు.