: స్త్రీలపై హింసాత్మక దృశ్యాలను చిత్రీకరించే సినిమాలు, సీరియళ్లపై కఠినచర్యలకు సమాయత్తమవుతున్న కేసీఆర్!


మహిళలపై జరుగుతోన్న అత్యాచారాలు, అకృత్యాలకు... సినిమాల్లో, సీరియల్స్ లో చూపించే హింసాత్మక దృశ్యాలు కూడా ఓ కారణమని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో మహిళలపై హింసాత్మక దృశ్యాలను, దురాగతాలను చిత్రీకరించి... చూపించే సినిమాలు, సీరియల్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన యోచిస్తున్నారు. ఇలాంటివి చూడటం వల్ల యువతలో నేరప్రవృత్తి పెరుగుతోందని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే ఇలాంటి కంటెంట్ ఉండే సీరియల్స్, సినిమాలపై ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో అధ్యయనం చేసి తనకు నివేదించాలని కేసీఆర్ డీజీపీ అనురాగ్ శర్మను ఆదేశించారు.

  • Loading...

More Telugu News