: కొత్త సంక్షేమపథకాల రూపకల్పన కోసమే... తెలంగాణ బడ్జెట్ సమావేశాలు వాయిదా


తెలంగాణ బడ్జెట్ సమావేశాలు వాయిదా పడ్డాయి. వాస్తవానికి ఈ సమావేశాలు సెప్టెంబర్ 10 నుంచి ప్రారంభం కావాలి. కానీ, ఈ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించలేమని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ నరసింహన్ కు చెప్పారు. గత ప్రభుత్వాలు రూపొందించిన పాత సంక్షేమ పథకాలన్నిటినీ రద్దు చేసి... నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర అవసరాలకు తగ్గట్టుగా కొత్త పథకాలకు రూపకల్పన చేస్తున్నామని... దీనికి తమకు మరికొంత సమయం పడుతుందని కేసీఆర్ నరసింహన్ కు స్పష్టం చేశారు. ఈ నేపధ్యంలో బడ్జెట్ అంచనాల తయారీ సెప్టెంబర్ 10 నాటికి పూర్తవదని.. సమావేశాలను సెప్టెంబర్ అనంతరం నిర్వహించుకోవడానికి అనుమతించాలని కోరారు. కేసీఆర్ విజ్ఞప్తికి గవర్నర్ అంగీకారం తెలపడంతో తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ సమావేశాలు అక్టోబర్ నెలలో జరిగే అవకాశం ఉందని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి.

  • Loading...

More Telugu News