: ఇన్నాళ్టికి పెళ్లి చేసుకుంటున్న హాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లు


హాలీవుడ్ స్టార్ హీరో బ్రాడ్ పిట్, హీరోయిన్ ఏంజెలినా జోలీ పెళ్లితో తమ బంధాన్ని మరింత పటిష్ఠం చేసుకోబోతున్నారు. చాలా కాలంగా సహజీవనం చేస్తున్న వీరిద్దరూ కాలిఫోర్నియా న్యాయమూర్తి నుంచి వివాహ అనుమతి పత్రాన్ని తీసుకున్నారు. వీరి పెళ్లిని ఫ్రాన్స్ లో న్యాయమూర్తి జరిపిస్తారని సంయుక్తంగా వెల్లడించిన ప్రకటనలో పేర్కొన్నారు. ఫ్రాన్స్ లోని చాటీ మిరావల్ లో జరుగనున్న ఈ వివాహ ఘట్టానికి సన్నిహితులు, బంధువులు మాత్రమే హాజరు కానున్నారని తెలిపారు. కాగా, స్టార్ హీరో, హీరోయిన్ వివాహానికి ప్రధాన ఆకర్షణ జోలీ కుమారులు మాడొక్స్, పాక్స్!

  • Loading...

More Telugu News