: బడ్జెట్ పై కార్యదర్శులతో సీఎం కేసీఆర్ సమీక్ష


తెలంగాణ ముఖ్య కార్యదర్శులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష జరిపారు. బడ్జెట్ రూపకల్పనకు శాఖల వారీగా 14 టాస్క్ ఫోర్సులను ఏర్పాటు చేశారు. శాఖలకు బడ్జెట్ కేటాయింపులకు ముందే విధానాలు రూపొందించాలని కేసీఆర్ అధికారులతో అన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. మూస పద్ధతిలో కాకుండా కొత్త విధానంలో బడ్జెట్ ఉండాలని ఆయన ఆకాంక్షించారు. కొత్త చట్టాలు, విధానాలు తీసుకొచ్చేందుకు సిద్ధమని ఆయన అన్నారు. రాబోయే ఐదేళ్లను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ ను రూపొందించాలని ఆయన అధికారులకు చెప్పారు.

  • Loading...

More Telugu News