: హైదరాబాదులో భారీ వర్షం


హైదరాబాదులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. సికింద్రాబాదు, హబ్సిగూడ, ట్యాంక్ బండ్, పాతబస్తీ, కోఠి, చాదర్ ఘాట్, మలక్ పేట, ఎంజే మార్కెట్, కూకట్ పల్లి, అమీర్ పేట తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. రోడ్లపై నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వినాయక చవితి సందర్భంగా పూజా సామగ్రి కొనుగోలు నిమిత్తం మార్కెట్లకు వచ్చిన నగరవాసులు ఈ వర్షంతో ఇబ్బంది పడ్డారు.

  • Loading...

More Telugu News