: హైదరాబాదులో ‘జన్ ధన్’ పథకాన్ని ప్రారంభించిన వెంకయ్య నాయుడు
హైదరాబాదులో ‘ప్రధానమంత్రి జన్ ధన్ యోజన’ పథకాన్ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆర్థిక వ్యవస్థలో అందరినీ భాగస్వామ్యం చేయటమే జన్ ధన్ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి కుటుంబానికి బ్యాంకు ఖాతా తెరవాలన్న లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించినట్లు ఆయన చెప్పారు. దేశంలో 35 శాతం మంది ప్రజలు మాత్రమే బ్యాంక్ సర్వీసులను వాడుకుంటున్నారని, ప్రజలకు రుణ సదుపాయం, ఇన్సూరెన్స్ అందించడమే ఈ పథకం లక్ష్యమని ఆయన చెప్పారు. ప్రమాదంలో కుటుంబ సభ్యుల్లో ఎవరు చనిపోయినా లక్ష రూపాయల బీమా సొమ్ము వస్తుందన్నారు. ఈ పథకంతో ఆర్థిక ప్రగతిలో వేగం పుంజుకుంటుందని వెంకయ్య చెప్పారు.