: 70 ఏళ్లు నిండినా ఇంకా వేలాడుతారా?: జనార్థన్ ద్వివేది సంచలన వ్యాఖ్యలు
‘70 ఏళ్లు నిండినా క్రియాశీలక పదవులు వదలరా?’ అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జనార్థన్ ద్వివేది సంచలన వ్యాఖ్యలు చేశారు. 70 ఏళ్లు నిండిన వృద్ధ నేతలు క్రియాశీలక పదవుల నుంచి వైదొలగాలని ఆయన సూచించారు. తరువాతి తరానికి రాజకీయాల్లో రాణించే అవకాశం కల్పించాలని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ అధ్యక్షులుగా, ఉపాధ్యక్షులుగా, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని వంటి పదవులు చేపట్టే విషయంలో వయసుకు మినహాయింపు ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. గతంలో రిజర్వేషన్లకు ప్రాతిపదిక ఆర్ధిక స్థితి కావాలని వ్యాఖ్యానించి వివాదం రేపిన ఆయన, ప్రియాంక గాంధీ రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తి చూపుతున్నారని వ్యాఖ్యానించి దుమారం రేపారు.